చేతులెత్తే పద్ధతిలో 19న కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తే పద్ధతిలో 19న కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో మండల ప్రజాపరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో నిబంధనల ప్రకారం చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు ఈ నెల 19వ తేదీన సంబంధిత మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో నిర్వహించాలన్నారు. ఎన్నికకు కనీసం ఆరురోజుల ముందుగా నవంబర్‌ 14వ తేదీలోపు ఎంపీడీవోలు, ప్రిసైడింగ్‌ అధికారులు మండల ప్రజా పరిషత్‌ సభ్యులందరికీ ఫారం–2 ద్వారా ఎన్నికల నోటీసులను అందజేయాలన్నారు. నవంబర్‌ 19వ తేదీన ఉదయం 10 గంటలలోపు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఫారం–3 ద్వారా నామినేషన్లను స్వీకరించాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహించి, అనంతరం ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిచాలన్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం అదే రోజు మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు సంబంధించి తదుపరి సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో సీఈఓ శివశంకర్‌, జెడ్పీ సీఈవో సుబ్బారెడ్డి, డీఎల్‌డీఓ శివారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement