శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ట్రక్ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి బహూకరించారు. గురువారం ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద వాహనాన్ని, సంబంధిత పత్రాలను దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడుకు అందజేశారు. ఈ సందర్బంగా దేవస్థాన చైర్మన్ మాట్లాడుతూ.. వాహనాన్ని అన్నప్రసాద వితరణకు సంబంధించిన కూరగాయలను సరఫరా చేసుకునేందుకు వినియోగిస్తామన్నారు. గ్రామీణ బ్యాంకు రీజనల్‌మేనేజర్ ఎం.సుధాకర్, శ్రీశైలం బ్రాంచ్ మేనేజర్ రవీంద్రారెడ్డి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: అన్నప్రసాద వితరణ పథకానికి గురువారం ఒంగోలుకు చెందిన డి.అంజిరెడ్డి రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
శ్రీశైలం డ్యాంలో
49 టీఎంసీల నీరు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో గురువారం సాయంత్రం సమయానికి 49.7486 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 830.20 అడుగులకు చేరుకుంది. ఇదిలా ఉండగా జలాశయం బ్యాక్ వాటర్ నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు బుధవారం నుంచి గురువారం వరకు 3,954 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 494, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
డిపాజిట్ తప్పనిసరి
నంద్యాల(అర్బన్): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు నిర్దేశించిన మొత్తాన్ని డిపాజిట్‌గా తప్పనిసరిగా చెల్లించాలి. నామినేషన్ ఫారంతో పాటు డిపాజిట్ కింద సర్పంచ్ స్థానానికి ఇతరులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే రూ.1500 చెల్లించాలి. వార్డు స్థానాలకు ఇతరులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే రూ.500 చెల్లించాలి. 10వేలకు తక్కువ జనాభా కలిగిన పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థి రూ.2.50లక్షలు, 10వేలకు మించి జనాభా కలిగిన చోట పోటీ చేసే వారు రూ.4లక్షల వరకు వ్యయ పరిమితి పాటించాల్సి ఉంది. 10వేలకు తక్కువ జనాభా కలిగిన చోట వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.50వేలు, 10వేలకు మించి జనాభా కలిగిన చోట రూ.లక్ష వ్యయం చేయాల్సి ఉంటుంది. వ్యయ పరిశీలకులు సూచించే విధంగా పోటీలోని అభ్యర్థులు తాము చేసిన ఖర్చులను నిబంధనలకు మేర లెక్కలను ఆడిటర్లకు అందించాల్సి ఉంది.


