టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

రుద్రవరం: మండల పరిధిలోని మందలూరుకు చెందిన టీడీపీకి చెందిన 25 కుటుంబాలు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంధం రాఘవరెడ్డి గ్రామంలోకి చేరుకోగానే నాయకులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు టీడీపీ వర్గీయులైన నంద్యాల పరమేశ్వర్‌రెడ్డి, నంద్యాల పాపిరెడ్డి, వడ్ల రామచంద్రాచారి, చాకలి లింగమయ్య, దూదేకుల బాబయ్య, నంద్యాల రామలింగారెడ్డి, నంద్యాల వీరారెడ్డి, రామతిరుపాల్‌రెడ్డి, నంద్యాల లింగమూర్తిరెడ్డి, దూదేకుల దస్తగిరి, దూదేకుల గఫూర్‌, చింతల పుల్లయ్య, సంకేసుల సూర్య నాగన్న, శాంతయ్య, అబ్రహంలతో పాటు మరో 10 కుటుంబాల వారికి వైఎ స్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ మాజీ ఎంపీపీ గజ్జెల రాఘవేంద్రారెడ్డి, పార్టీ నాయకులు నరసింహారెడ్డి, కాకనూరు శ్రీకాంతరెడ్డి, సగిలి సుధాకరరెడ్డి, పెద్ద నర్సిరెడ్డి, మహేంద్రారెడ్డి, సిద్ది గోపాల్‌, సగిలి మోహన్‌ రెడ్డి, వెంకటేశ్వరెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement