మహానంది: తెలుగుగంగ కాలువకు మహానంది మండలం గాజులపల్లె, ఆంజనేయపురం గ్రామాల సమీపంలో గండి పడి నీరు వృథాగా పోతోంది. ఈకాలువ ద్వారా శిరివెళ్ల మండలం మహదేవపురం, కోటకొండ తదితర గ్రామాల పరిధిలోని పొలాల వైపు నీరు వెళ్తుంది. కాలువకు గండిపడి నీరు వృథాగా పోతున్నా అధికారులు ఇటువైపు చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలుగుగంగ ఏఈ రమేష్ మాట్లాడుతూ.. నీటి వృథా విషయం తెలిసిందని, గండి పూడ్చివేతకు ఇసుక, రాళ్లతో నిండిన సంచులను వేశామన్నారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా పూడ్చివేస్తామని చెప్పారు.


