శ్రీగిరిలో కార్తీక రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో కార్తీక రద్దీ

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

మందుబాబుకు జైలు శిక్ష ఎన్నికల్లో అధికార దుర్వినియోగం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పరమేశ్వరునికి ప్రీతికరమైన మా సం కావడంతో శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తు లు బారులుదీరారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయ ఉత్తరద్వారం, గంగాధర మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దీపారాధన వేదిక వద్ద భక్తులు ప్రత్యేక నోములు నోచుకున్నారు. అనంతరం ఆలయ క్యూలైన్ల ద్వారా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమోగింది.

డోన్‌ టౌన్‌: మద్యం సేవించి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ మందుబాబుకు జడ్జి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. కర్నూలు సమీపంలోని గార్గేయపురానికి చెందిన శంకర్‌ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా విచారించిన న్యాయమూర్తి నూరుల్లా రెండు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలవరించినట్లు సీఐ ఇంతియాజ్‌ బాషా తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటంతో వారి ప్రాణాలతో పాటు ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా హాని ఉందని, ఈలాంటి వారి పట్ల, కోర్టు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సీఐ తెలిపారు.

భక్తులకు ఉచిత బస్సు సదుపాయం

శ్రీశైలంటెంపుల్‌: కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తులకు మంగళవారం నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాతాళగంగమెట్ల మార్గం నుంచి నంది సర్కిల్‌, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్‌, లడ్డూ కౌంటర్ల వరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

నంద్యాల(న్యూటౌన్‌): రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలను కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయా పార్టీల నాయకులు విమర్శించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఎన్నికలు ప్రజాస్వామికంగా నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈనెల 11వ తేదీన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వామపక్ష పార్టీల కార్యదర్శులు రమేష్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ యువజన విభాగం సన్నల సాయిరాంరెడ్డి, ధనుంజయుడులు, ఎస్‌డీపీఐ నియోజకవర్గ అధ్యక్షుడు ఎజాస్‌ తెలిపా రు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవా రం ఏర్పాటు చేసిన ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించడంలో వైఫల్యం చెందిందన్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసు బలగాలను అధికార యంత్రాన్ని పూర్తిగా పని చేసేలా అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement