● 12 గ్రామాల రైతులు, కేసీ కెనాల్ వద్ద ధర్నా
నంద్యాల(అర్బన్): కళ్ల ముందు ఎండిపోతున్న పంటలకు సాగునీరు విడుదల చేసి కాపాడాలంటూ గడివేముల మండలానికి చెందిన 12 గ్రామాల రైతులు మంగళవారం కేసీ కెనాల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని కేసీ కెనాల్, రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు నాయకులు కరిమద్దెల ఈశ్వరరెడ్డి, బూజనూరు రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ.. కరిమద్దెల, పెసరవాయి, గడిగరేవుల, బూజనూరు, చిందుకూరు, తిరుపాడు, గ్రంథివేముల, కొరటమద్ది తదితర గ్రామాల్లో 4వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం కంకి దశకు చేరుకుంటున్న సమయంలో సాగునీరు అందక పైర్లు ఎండుదశకు చేరుకున్నాయి. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రెండు విడతలుగా పంటలు ఎండిపోతున్నా ప్రభు త్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. శ్రీశై లం బ్యాక్ వాటర్‌ను ముచ్చుమర్రి ఎత్తిపోతల మోటార్లతో తోడి కేసీ కెనాల్ ద్వారా రేగడగూడూరు వద్ద సబ్ చానళ్ల అందించి పంటలను కాపాడాలన్నారు. సాగునీరు విడుదల చేయకపోతే రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం సాగునీరు అందించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌కి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రైతు లు అన్నెం మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కుమ్మరి సుంకన్న, మధుసూదన్‌రెడ్డి, కుమ్మరి పుల్లయ్య, చెంచురెడ్డి, మునగాల ఈశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.


