ఆళ్లగడ్డ: పట్టణంలో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఏఎన్‌ఆర్ చికెన్ సెంటర్ యజమాని సాధిక్‌పై హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్ట్ చూపించారు. డీఎస్పీ వివరాల మేరకు.. ఈ నెల 4వ తేదీ సాధిక్‌పై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు కాచింతల క్షేత్రం సమీపంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి దాడి చేశారు. ఆళ్లగడ్డకు చెందిన దుర్గాప్రసాద్, అనిల్‌కుమార్‌రెడ్డి తోపాటు మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తులు, ఒక మోటర్‌సైకిల్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ రౌడీయిజం, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో సీఐ రాము, ఎస్‌ఐలు చిన్నపీరయ్య, రామకృష్ణరెడ్డి, శ్రీనివాస గౌడ్‌లు ఉన్నారు.
˘ ఈనెల 4వ తేదీన వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం
˘ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
˘ కత్తులు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం


