వెలిగిన ఆకాశదీపం | - | Sakshi
Sakshi News home page

వెలిగిన ఆకాశదీపం

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

ఇద్దరు చిన్నారులకు మెదడువాపు వ్యాధి

శ్రీశైలంటెంపుల్‌: కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం పైభాగంలో ఆకాశదీపం నెలకొల్పారు. కార్తీకమాసం ముగింపు వరకు ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజ చేశారు. అనంతరం దీపప్రజ్వలన, దీపారాధన జరిపించారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాలుగో స్థానంలో మహానంది

● రెండో స్థానంలో

శ్రీ రంగాపురం మద్దిలేటిస్వామి

మహానంది/బేతంచెర్ల: రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్‌ హోదా కలిగిన 14 ఆలయాల్లో భక్తులకు అందే సౌకర్యాలు, వసతులు తదితర వాటిపై ఆంధ్రప్రదేశ్‌ దేవదాయశాఖ నిర్వహించిన భక్తుల అభిప్రాయాలపై మహానంది ఆలయం నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని పెంచలకోన ఆలయం 77.0 శాతంతో మొదటి స్థానంలో నిలవగా జిల్లాలోని రంగాపురం శ్రీ లక్ష్మీ మద్దులేటి స్వామి దేవస్థానం 75.3 శాతంతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఆర్‌జేసీ, డీసీ హోదా కలిగిన ఆలయాల్లో దర్శనం సంతృప్తికరంగా జరిగిందా?, దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా?, ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా?, దేవాలయాల్లో పారిశుధ్య సంతృప్తికరంగా ఉందా? అనే ప్రశ్నలతో భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. అందులో మహానంది ఆలయం 72.0 శాతంతో కేవలం నాలుగవ స్థానానికే పరిమితం కావడం అధికారుల పాలనా తీరుకు నిదర్శనంగా కనిపిస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏడా ది, మూడు నెలలు, నెలకోసారి నిర్వహించే ఇలా ంటి ఫీడ్‌బ్యాక్‌ రిపోర్టులో మహానంది మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయా ల్సిన అవసరం ఉంది. మద్దిలేటి స్వామి క్షేత్రానికి గతంతో పోలిస్తే పాజిటివ్‌ స్కోర్‌ 8.8 శాతం మెరుగుదలైందని ఆలయ డిప్యూటీ కమిషనర్‌ రామాంజనేయులు, చైర్మన్‌ ఎల్ల నాగయ్య తెలిపారు.

పది పరీక్ష ఫీజు చెల్లించండి

నంద్యాల(న్యూటౌన్‌): 2027 మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఈనెల 11 నుంచి 25 వరకు అపరాద రుసుం లేకుండా ఫీజు చెల్లించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ప్రదానోపాధ్యాయుల యూడైజ్‌ లాగిన్‌లో మొదటగా పరీక్ష రాసే విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసి ధ్రువీకరించుకోవాలన్నారు. ఆతర్వాత షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌సైట్‌ బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ స్కూల్‌ లాగిన్‌ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. రూ. 50 ఆలస్య రుసుంతో ఈనెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 3 నుంచి 9వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 10 నుంచి 15 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్‌ ఆభ్యర్థులు అన్ని సబ్జెక్టులు, గతంలో పరీక్ష తప్పిన విద్యార్థులు మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్‌ అభ్యర్థులకు అదనంగా రూ. 60, నిర్ణీత వయస్సు లేని ఏజ్‌ కండోనేషన్‌ ఫీజు రూ.300 చెల్లించాలన్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): ప్రాణాంతక మెదడు వాపు వ్యాధి ఇద్దరు చిన్నారులను పట్టిపీడిస్తోంది. గ్రామాల్లో నెలకొన్ని అపరిశుభ్ర వాతావరణంతో దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి ప్రస్తుతం ఈ ఇద్దరు చిన్నారులను అంపశయ్యపై పడుకోబెట్టింది. జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన కౌతాళానికి చెందిన బసవ, ఎల్లమ్మ దంపతుల కుమారుడైన బసవ(3) గత పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాదపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానికంగా, అనంతరం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గత మంగళవారం కర్నూలు జీజీహెచ్‌కు రెఫర్‌ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలోని పీఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అలాగే కౌతాళానికి చెందిన ఈరన్న, మంగమ్మల కుమార్తె అయిన గాయత్రి (1) గత దసరా పండుగ సమయం నుంచి జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించినా తగ్గకపోవడంతో ఆదోనికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వారం క్రితం కర్నూలు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇక్కడి పిల్లల వైద్యులు వీరి లక్షణాలను బట్టి రక్తపరీక్షలు చేయించగా మెదడువాపు(జేఈ) నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మేరకు వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. వీరిలో వేదాంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement