కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వ 32 నెలల పాలనకే ప్రజలు విసిగెత్తిపోయారని, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ మార్పు తథ్యమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఈసీ సభ్యులు దేశం సుధాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్‌ దాల్‌మిల్‌ అమీర్‌బాషాలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తమ కార్యకర్తలపై దాడులకు తెగబడిన వారిని వదిలేదిలేదని, తమ ప్రభుత్వం వచ్చాక అంతకు రెండింతలు తిరిగి చెల్లిస్తామన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోకుండా పోలీసులను, ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను వాడుకుని దొడ్డిదారిన అభ్యర్థులను గెలిపించారన్నారు. అయినప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో నంద్యాల నియోజకవర్గంలో సత్తా చాటామన్నారు. ఇది భవిష్యత్తులో ప్రభుత్వంపై పోరాడేందుకు తనకు ప్రజలిచ్చిన శక్తిగా భావిస్తామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ కుట్రలు సాగవని భావించి తనని పోలీసులతో హౌస్‌అరెస్ట్‌ చేయించారన్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు నిత్యావసరాలు కొనలేని పరిస్థితికి వచ్చారని ప్రజలను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందో అర్థం కావటం లేదన్నారు. పెట్రోల్‌ నుంచి గ్యాస్‌ సిలిండర్ల వరకూ పేదలకు పెను భారంగా మారిందని ఇంతటి పనికిమాలిన పాలనను ప్రజలు ఎప్పు డూ చూడలేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దాని ఫలితమే ఎన్నికల్లో తాము సాధించిన విజయమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీదేవి, పెద్ద నరసింహుడు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

దాడులకు పాల్పడిన వారిని

వదిలేది లేదు

మాజీ ఎమ్మెల్యే

శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement