కొలిమిగుండ్ల: కోర్నపల్లె సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయ శివార్లలోని గుహలో బయ ట పడిన శివలింగానికి సోమవారం అభిషేకం చేశారు. వేదపండితులు ఆలూరి నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోరిక మేరకు మునీశ్వరస్వామిగా నామకరణం చేశారు. నాలుగు రోజుల క్రితం భక్తులు గుహలో అడ్డుగా ఉన్న బండ రాళ్లు తొలగించి లోపలికి వెళ్లగా స్వయంభుగా వెలసిన శివలింగం కనిపించిన విషయం తెలిసిందే. పూర్వం మునీశ్వరులు గుహలో తపస్సు చేసుకునే వారని పెద్దలు చెబుతున్నారు. గుండం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి విగ్రహాన్ని సాక్షాత్తు వశిష్ట మహాముని చేతుల మీదుగా ప్రతిష్ట జరిగింది. ఈపరిసరాల్లో మునీశ్వరులు ఉండేవారని భక్తులు నమ్ముతున్నారు. కార్తీక మాసం ఆరంభంలో శివలింగం కనిపించడంతో స్వామిని దర్శించుకునేందుకు వృద్ధులతో పాటు భక్తులు కష్టం మీద అక్కడికి చేరుకుంటున్నారు.


