వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

Nov 7 2026 1:06 AM | Updated on Nov 7 2026 1:06 AM

కొత్తపల్లి: మండలంలో శుక్రవారం రెండు చోట్ల బైకులు ఢీకొన్న ప్రమాదాల్లో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జి.వీరాపురం గ్రామానికి చెందిన విశ్వనాథ రెడ్డి బైకుపై ఆత్మకూరు వైపు వెళుతున్నాడు. అదే సమయంలో కొత్తపల్లికి చెందిన మురళి ఆత్మకూరు వైపు నుంచి గ్రామానికి బైకుపై వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి, బావాపురం గ్రామాల మధ్యలోని వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌ కాలువ వద్ద బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విశ్వనాథ రెడ్డికి ఎడమ కన్ను క్రింది భాగంలో లోతైన గాయం అయ్యింది. మురళికి రక్తగాయాలయ్యాయి. స్థానికులు వారిని కొత్తపల్లి వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించగా మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు కర్నూలుకు రెఫర్‌చేశారు.

● అదేవిధంగా మండలంలోని జి.వీరాపురం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. శివపురం గూడెంకు చెందిన అంకులయ్య, చరణ్‌, పాలెంచెరువు గూడెంకు చెందిన అంకన్నను ఇంటి వద్ద వదలిపెట్టేందుకు ఒకే బైక్‌పై బయలుదేరారు. ఇదే క్రమంలో గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న బైకుపై కొత్తపల్లివైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో వీరాపురం గ్రామం వద్ద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరగింది. ఈ ప్రమాదంలో శివపురం గూడెంకు చెందిన అంకులయ్యకు కుడి కాలు విరిగింది. చరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ప్రమాదంలో బోయ లక్ష్మన్న తలకు రక్తగాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న వారు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చరణ్‌కు కుడి కాలు విగినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement