పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

Nov 7 2026 1:06 AM | Updated on Nov 7 2026 1:06 AM

నందవరం: ఎమ్మిగనూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సి.రఘు (45) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం నందవరంలో శుక్రవారం పోలీసు లాంఛనలతో ముగిశాయి. ఆయన మృతదేహానికి ఏఆర్‌ రిజర్వ్‌ పోలీసులు ప్రత్యేక గౌరవ వందనం(గార్డ్‌ ఆఫ్‌ హానర్‌) సమర్పించారు. గాలిలోకి మూడు రౌండ్లు తుపాకులు పేల్చి, బిగ్యుల్‌ ధ్వనితో సైనిక సంప్రదాయాలతో కడసారి వీడ్కోలు పలికారు. అలాగే జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు చేతుల మీదుగా మృతుడి భార్య హేమలత, కుమారుడు సాయి ప్రణీత్‌, కూతురు తేజశ్వినికి తక్షణ సాయం కింద రూ.లక్ష చెక్కును అందజేశారు. నందవరం స్టేషన్‌ పోలీసులు, ఎమ్మిగనూరు రూరల్‌ పోలీసులు, వివిధ స్టేషన్లలో పని చేస్తున్న కానిస్టేబుళ్లు రఘు అంత్యక్రియలకు తరలివచ్చి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement