జిల్లాలో కంది సాగు
వివరాలు (హెక్టార్లలో)
విస్తీర్ణం విస్తీర్ణం
ఆశలు ఎండి..
కోవెలకుంట్ల: రెండేళ్ల నుంచి రైతులకు కందిసాగు కలిసి రావడం లేదు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు పంటను వెంటాడుతుండటంతో కంది రైతులకు కష్టకాలం దాపురించింది. జిల్లాలో గత ఏడాది విత్తనానికి ముందు వర్షాభావం, పైరు పూత, పిందె దశలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి దిగుబడులు చేతికందకుండా పోయాయి. పెట్టిన పెట్టుబడులు వర్షార్పణం కాగా ఈ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకుందామనుకున్న రైతులకు ఈ ఏడాది కూడా నిరాశే మిగిలింది. 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 38,194 హెక్టార్లలో కంది పంట సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో బోర్లు, బావులు, ఎస్సార్బీసీ, కుందూనది, కేసీ కెనాల్, వర్షాధారం, తదితర సాగునీటి వనరుల ఆధారంగా 22,480 హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో జిల్లాలోని డోన్ మండలంలో అత్యధికంగా 10,473 హెకార్టలో, బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 5,699, ప్యాపిలి మండలంలో 3,796 హెకార్టల్లో, బనగానపల్లె మండలంలో 1.091, మిడుతూరు మండలంలో 6,30 హెక్టార్లలో, జూపాడుబంగ్లా మండలంలో 275 హెక్టార్లలో సాగైంది. మహానంది, రుద్రవరం, ఆళ్లగడ్డ, శిరివెళ్ల, బండిఆత్మకూరు, చాగలమర్రి మండలాల్లో ఒక్క ఎకరాలో కూడా కంది సాగు సాగు కాకపోవడం గమనార్హం. మిగిలిన మండలాల్లో వందలోపు హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. ఆరు నెలలు పంటకాలం కాగా జూన్ రెండో వారంలో రైతులు కంది విత్తనం వేశారు. విత్తనం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడం, శ్రీశైలం జలాశయంలో సెప్టెంబర్ 15 వరకు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎస్సార్‌బీసీ, కేసీకెనాల్, తదితర సాగునీటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోవడంతో పైరులో ఎదుగుదల నిలిచిపోయింది.
గతేడాది ముంచిన మోంథా
గత ఏడాది ఖరీఫ్‌లో 37,177 హెక్టార్లలో కంది సాగు లక్ష్యం కాగా ఆయా మండలాల పరిధిలో 27,540 హెక్టార్లలో సాగు చేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, కలుపునివారణ, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల దాకా వెచ్చించారు. పైరు పూత, పిందె దశలో ఉండగా గత అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి పూత, పిందె రాలిపోయింది. భారీ వర్షాలతో పూత రాలిపోవడమే కాకుండా పైరును రబ్బరు పురుగు ఆశించి ఉన్న పూత, పిందెను తినేశాయి. ఐదు నెలల పాటు పైరు కాపాడుకోగా భారీ వర్షాలు కురిసి దిగుబడులు చేతికందకుండాపోయాయి.
పెట్టుబడులు నేలపాలు
ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది పంట సాగు చేయగా ఎల్‌నినో ప్రభావంతో ఐదు నెలల నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఎకరాకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేలు వెచ్చించిన పెట్టుబడులు నేలపాలయ్యాయి. విత్తనం వేసిన తర్వాత నాలుగు నెలలు పూర్తయినా వరణుడు కరుణించకపోవడంతో పైరులో ఎదుగుదల నిలిచిపోయి బెండగిల్లిపోయింది. బోర్లు, బావులు ఉన్న రైతులు అతికష్టం మీద సాగునీటిని మళ్లించుకుంటున్నారు. పైపులు, ఆయిల్ ఇంజన్లు, కూలీల ఖర్చు రూపంలో ఎకరాకు రూ. 5 వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. వర్షాభావర పరిస్థితుల కారణంగా బోర్లలో సాగునీరు అంతంత మాత్రంగానే వస్తుండటంతో రోజుల తరబడి పైరుకు నీటిని మళ్లించుకోవాల్సివస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారంగా సాగు చేసిన కంది రైతులకు ఒకవైపు వర్షం పడక, మరోవైపు సాగునీరు అందుబాటులో లేక పైరు ఎండుదశలో చేరుకుంది. రెండేళ్ల నుంచి కందిసాగు అచ్చిరాలేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నియోజకవర్గం సాధారణ సాగు
డోన్ 28,541 19,968
బనగానపల్లె 4,488 1169
నందికొట్కూరు 3,245 1,219
ఆళ్లగడ్డ 939 05
నంద్యాల 128 01
శ్రీశైలం 67 07
పాణ్యం, 786 111
గడివేముల
రెండేళ్లుగా కలిసిరాని కంది సాగు
గతేడాది మోంథా,
ఈ ఏడాది ఎల్‌నినో దెబ్బ
శ్రీశైలం నిండినా కాల్వలకు
నీరు విడుదల చేయని ప్రభుత్వం
వర్షాభావంతో నిలిచిపోయిన
పంట ఎదుగుదల


