అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం | - | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

● ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య

కర్నూలు: అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య అన్నారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ – 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏసీబీ కోర్టు ఆవరణలో అవినీతి నిరోధక శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064ను ప్రజలకు తెలియజేసే పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి ఎవరైనా లంచం డిమాండ్‌ చేసినట్లయితే ప్రజలు సంకోచం లేకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవినీతి నిరోధక చర్యలపై అవగాహన కల్పించడం, లంచం డిమాండ్‌ చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను ఏసీబీ డీఎస్పీ (9440446178), సీఐ (9491305629), ఏసీబీ కార్యాలయం (08518–273783)కు ఫోన్‌ చేసి కూడా సమాచారం అందించవచ్చునని సూచించారు. కర్నూలు నగరంలోని వివిధ న్యాయాధికారులు, ఏసీబీ డీఎస్పీ సీతారామరావు, సీఐ కృష్ణయ్య, ఏసీబీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు శ్రీరామ్‌ భగవాన్‌, శ్రీనివాసులు, ప్రేమ్‌సాగర్‌, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement