మందుబాబులకు జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

మందుబాబులకు జైలు శిక్ష

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

డోన్‌ టౌన్‌: మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు మందుబాబులకు జైలు శిక్ష పడినట్లు సీఐ రాకేష్‌, ఎస్‌ఐ మమతలు సోమవారం తెలిపారు. డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడిన చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన తలారి బాల మద్దిలేటికి ఐదు రోజులు, కోట్ల వారిపల్లెకి చెందిన హసిన్‌, హుస్సేన్‌పీరాలకు ఒక్కక్కరికి రెండు రోజుల చొప్పున జడ్జి నూరుల్లా జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వన్యప్రాణులపై సర్వే

రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు, వాటి ఆవాసాలపై సర్వే కొనసాగుతున్నట్లు రుద్రవరం రేంజ్‌ అధికారి ముర్తుజావలి సోమవారం తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుద్రవరం రేంజిలోని 14 బీట్లు (ఏరియాల్లో) వన్యప్రాణులపై సర్వే చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజులు ప్రతి బీట్‌లో సిబ్బంది 5 కి.మీ మేర కాలినడకన వెళ్తూ మాంసాహర జంతువులు పులి, చిరుత, ఎలుగుబంటి, రేస్‌కుక్క, అడవిపిల్లి తదితర వన్యప్రాణుల ఆనవాళ్లు, పాదముద్రలు, వాటి విసర్జన పెంటికల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరి కొద్ది రోజులు శాకాహర జంతువులైన చుక్కలదుప్పి, కొండ గొర్రె, అడవిపంది, సాంబార్‌, మనుబోతు వంటి వాటి ఆనవాళ్లు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ వలంటీర్లు పాల్గొంటున్నట్లు రేంజర్‌ తెలిపారు.

గువ్వలచెరువు ఘాట్‌ లోయలో పడ్డ లారీ

● డ్రైవర్‌ దుర్మరణం,

క్లీనర్‌కు తీవ్ర గాయాలు

రామాపురం: వైఎస్సార్‌ జిల్లాలోని గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల దాణా లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో డ్రైవర్‌ దుర్మరణం చెందగా, క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల పట్టణానికి చెందిన డ్రైవర్‌ జి.దాస్‌, ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన క్లీనర్‌ మహబూబ్‌ బాషా లారీలో పశువుల దాణా తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 7.30 గంటలకు గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలో పడి నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌ జి.దాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ మహబూబ్‌ బాషాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

బెల్లం ఊట ధ్వంసం

ఆదోని రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌శాఖ అధికారులు సోమవారం ఆదోని పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎకై ్సజ్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఈఎస్‌టీఎఫ్‌ కర్నూలు బలగాలతో కలిసి ఆదోని శివారులోని ఆఫీసరాళ్ల, రణమండల కొండల ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 570 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పాత ఎకై ్సజ్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న గర్జప్ప, సునీత, శివ, సోమక్కలను తహసీల్దార్‌ ముందు హాజరుపరిచి బైండోవర్‌ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement