మంత్రి తనయుల సేవలో తరిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

మంత్రి తనయుల సేవలో తరిస్తూ..

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

ఈఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దూదేకుల దస్తగిరి ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ. 50 వేల జీతం తీసుకుంటున్నాడు. దస్తగిరి మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్‌ పేషీలో ఉంటూ మంత్రి అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టులను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రచారం చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా నంద్యాలలో ఉన్న మంత్రి కుమారుల వెంట తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాడు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడంతో వివాదంగా మారింది. ప్రభుత్వం నుంచి వేల రూపాయలు జీతం పొందుతూ టీడీపీ ప్రచారాలకు పనిచేయడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement