ఏడు పర్యాయాల మంత్రి నంద్యాలకు ఏమి చేశారు? | - | Sakshi
Sakshi News home page

ఏడు పర్యాయాల మంత్రి నంద్యాలకు ఏమి చేశారు?

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

బొమ్మలసత్రం: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు 70 ఏళ్లు నిండాయని, ఇప్పటికే ఏడు పర్యాయాలకు పైగా మంత్రి పదవులు అనుభవించిన ఆయన నంద్యాల పట్టణానికి ఏమి సాధించారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం పట్టణంలోని 15, 16, 42, 43 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ దాల్‌మిల్‌ అమీర్‌బాషా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. టీడీపీకి ఓటేస్తే మున్సిపాల్టీ ఖాజానాను ఊడ్చేస్తారన్నారు. రహదారుల అభివృద్ధి పేరుతో మున్సిపాల్టీ నిధులు మింగేసి తిరిగి ఖజానా నింపడానికి ఇంటి పన్ను, కుళాయి పన్ను పెంపు కోసం సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో పాటు, కరెంట్‌ చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. కష్టకాలంలో పలకరించని టీడీపీ నాయకులు ఇప్పుడు ఓట్ల దండుకోవటానికి ఇళ్ల వద్దకు వస్తున్నారని, ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు నిలబెట్టేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్లు చూస్తే తాము పడిన కష్టం తెలుస్తుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం మూడేళ్లలోనే నంద్యాలను జిల్లాగా మార్చడం, మెడికల్‌ కాలేజీ, అనేక కళాశాల భవనాలు, సచివాలయ భవనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ పార్టీకి ఎస్‌డీపీఐ పార్టీ నాయకులు మద్దతు తెలిపారని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 15వ వార్డు అభ్యర్ధి బైసాని రమేష్‌, 16వ వార్డు షేక్‌ ముంతాజ్‌, 42వ వార్డు షేక్‌ శంషాద్‌, 43వ వార్డు లక్ష్మీదేవిలతో పాటు చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ దాల్‌మిల్‌ అమీర్‌బాషాను గెలిపించాలని కోరారు.

టీడీపీకి ఓటేస్తే

మున్సిపాల్టీ ఖాజానా ఖాళీ

కరోనా కష్టకాలంలో

వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది

మూడేళ్లలో ఊహించని

అభివృద్ధి చేశాం

మాజీ ఎమ్మెల్యే

శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement