ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పఠాన్ హుస్సేన్‌బాషా ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌కు సంబంధించి సోషల్ మీడియా అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఉద్యోగం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.30 వేల జీతం పొందుతున్నాడు. అమరావతిలోని మంత్రి పేషీలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు ప్రచారం చేయాల్సి ఉంది. అయితే హుస్సేన్‌బాషా ప్రస్తుతం ఎన్నికల వేళ నంద్యాల పట్టణంలోని టీడీపీ నాయకులతో పాటు కలిసి ఇంటింటికీ వెళ్తూ ప్రచారం చేస్తున్నాడు. మంత్రి కుమారుడు ఎన్ఎమ్డీ ఫిరోజ్‌తో పాటు అన్ని పార్టీ కార్యక్రమాలు ఈయనే చూసుకోవడం గమనార్హం.


