ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

నంద్యాల(న్యూటౌన్‌): సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న ఉపాధ్యాయినులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, పదవీ విరమణకు సమీపంలో ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాల ని జిల్లా ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి శివయ్య అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మునిసిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలలో పోలింగ్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా విద్యుత్‌, తాగునీరు ఉండేలా ఏర్పా ట్లు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్‌ హుస్సేన్‌, వీరేశ్వర్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి జిల్లా సబ్‌ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి, నాగార్జున, రాజేష్‌, దస్తగిరిబాషా, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి

కొత్తపల్లి: ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపైనే కుమారుడు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జయశేఖర్‌ తెలిపారు. మండలంలోని కొక్కెరంచ గ్రామానికి చెందిన బోయ సాలమ్మ, శ్రీనివాసులు దంపతుల కుమారుడు దామోదర్‌ అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మిని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే దామోదర్‌ భార్య కుటుంబంతో అతని తల్లిదండ్రులకు గతం నుంచి విభేదాలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆస్తిని ఇవ్వమని కుమారుడికి తేల్చేశారు. అయితే దామోదర్‌కు అప్పులు కావడంతో ఆస్తి పంచమని తల్లిదండ్రులను అడుగుతున్నా వారు ఒప్పుకోలేదు. దీంతో ఈనెల 21వ తేదీన తల్లిదండ్రులపై అతను కట్టెతో దాడి చేశాడు. ఈ విషయంపై దామోదర్‌, అతని అత్తమామలపై సాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ముగిసిన పవిత్రోత్సవాలు

ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం తెల్లవారుజామున పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా మూలమూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహుడిని యాగ శాలలో కొలువుంచి నవకళశాలతో అభిషేకించి నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచి పవిత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, శాంతి హోమాలు చేపట్టారు. అర్ధరాత్రి అనంతరం ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణం అనంతరం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్‌ శఠకోప వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement