టీడీపీ నేత జలదోపిడీ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత జలదోపిడీ

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

రుద్రవరం: ప్రకృతి వనరులను కొల్లగొడుతూ ‘మాది మంచి ప్రభుత్వం’ అంటున్న టీడీపీ నాయకులు చివరకు మంచినీటిని సైతం వదలడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో బోర్లు ఎండిపోయి రైతులు నష్టపోతే ఓ టీడీపీ నాయకుడు మాత్రం ‘అధికారం మాది.. అడిగేవారు ఎవరంటూ’.. ఏకంగా మంచినీటితో పంటలు సాగు చేస్తున్నాడు. మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి ముత్తలూరు మెట్ట వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా పొలం ఉంది. ఆ పొలంలో ఓ వైపు మొక్కజొన్న, మరో వైపు వరి సాగు చేశాడు. ఆ పంటలకు మొన్నటి వరకు తన పొలంలో బోరు నుంచి నీటిని అందించాడు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలం సమీపంలో హరినగరం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నుంచి పల్లెలకు వెళ్తున్న మంచినీటి పైపు లైన్‌పై అతని కన్ను పడింది. ఈ పైప్‌లైన్‌ నుంచి ముత్తలూరు, నల్లవాగుపల్లె గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా అవుతోంది. ఆయా గ్రామాలకు రక్షిత మంచినీరు వెళ్లకుండా నిలిపేసి నిరంతరం ఆ నీరు తన పొలానికి పారేలా ప్రత్యేకంగా పైప్‌లైన్‌ అమర్చుకున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని తన పొలంలోని బోరు మోటార్‌ నుంచి రక్షిత మంచినీటి పైప్‌లైన్‌కు కలిపాడు. హరినగరం ఎస్‌ఎస్‌ట్యాంక్‌ నుంచి వచ్చే నీరు నిరంతరం టీడీపీ నాయకుడి పొలాల్లోని పంటలకు పారుతోంది. దీంతో ముత్తలూరు, నలవాగుపల్లె గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా కావడం లేదు. విషయం తెలిసిన పంచాయతీ అధికారులు నోరు మెదపలేక గ్రామాల్లోని బోరు మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. టీడీపీ నాయకుడి జలదోపిడీని అధికారులు అడ్డుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీడీపీ నేతపై చర్యలు తీసుకుని, తమ గ్రామాలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రక్షిత మంచినీరు

పొలానికి మళ్లించిన వైనం

రెండు గ్రామాల ప్రజలకు అందని నీరు

చర్యలు తీసుకోని హరినగరం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement