ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో మూడురోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వేకువ జామునే సుప్రభాత సేవతో శ్రీ ప్రహ్లాదవరదస్వామిని మేలుకొలిపి దివ్య దర్శనం అనంతరం మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్చారణలతో ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు.


