ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలోని కోర్టుల సముదాయ భవనం శిథిలావస్థలో ఉండి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రధాన న్యాయమూర్తి వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి శనివారం పరిశీలించారు.పెచ్చులు ఊడిపోయి ప్రమాదకరంగా ఉన్న కోర్టు గదులను ఉద్యోగులు, న్యాయవాదులు వారికి చూపించారు. త్వరగా కోర్టు భవన సముదాయాన్ని వేరోచోటికి మార్చి ఉద్యోగులు, న్యాయవాదులకు భద్రత కల్పించాలని వారికి విజ్ఞప్తి చేశారు. నూతన భవనం నిర్మాణం కోసం అనుమతులు ఇప్పించాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్, న్యాయవాదులు నగేష్, సుధాకరరెడ్డి, బలరాం నాయక్ రాథోడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


