దరఖాస్తు ప్రక్రియలో జాప్యానికి తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు ప్రక్రియలో జాప్యానికి తావివ్వొద్దు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

నంద్యాల(న్యూటౌన్‌): కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో జాప్యానికి తావివ్వొ ద్దని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్ట 1, 2 స్వర్ణ వార్డులను జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నూతన పింఛన్ల కోసం దర ఖాస్తు చేసుకునే విధానాన్ని స్వయంగా పరిశీలించి, దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలు సుకున్నారు. ఒక్కో దరఖాస్తు ప్రక్రియకు పడుతున్న సమయం, దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, అర్హత ప్రమాణాలు తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్‌ కోసం వచ్చే వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ పథకం ప్రయోజనం అందేలా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా, పారదర్శకంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement