కొత్త పింఛన్ల దరఖాస్తుకు గడువు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో అర్హులైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల వద్ద బారులుదీరుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన గడివేములలో రెండు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క డిజిటల్ అసిస్టెంట్ ఉండటంతో లబ్ధిదారులు గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సచివాలయాలకు సిబ్బందిని కేటాయించా లని పలువురు కోరుతున్నారు.
– గడివేముల
రుద్రవరం మండలం ఎల్లావత్తుల సచివాలయంలో విద్యుత్ కోతతో వేచి ఉన్న దరఖాస్తుదారులు


