శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం సదర్శనకు అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. క్షేత్రంలో భక్తుల రద్దీతో ఇక్కడ ఏ వ్యాపారం చేసిన వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతారు. ఇందుకోసం శ్రీశైల క్షేత్రంలో వ్యాపారం నిర్వహించుకునేందుకు పలువురు వ్యాపారులు ఆసక్తి చూపుతారు. వ్యాపారులతో పాటు తామేమి తక్కువ కాదు అన్నట్లు టీడీపీకి చెందిన ముఖ్యనేత తనకు ఉన్న వ్యాపారాన్ని విస్తరించేందుకు పావులు కదిపారు. తనకు ఉన్న డెయిరీ ద్వారా పాలు, పాల ఉత్పత్తులు విక్రయించుకునేందుకు దుకాణం కేటాయించాలని దేవస్థానానికి విజ్ఞప్తి చేశారు. దేవస్థాన ఉన్నతాధికారి టీడీపీ ముఖ్యనేత వద్ద స్వామిభక్తి పొందేందుకు అడిగిందే తడవుగా అగమేఘాల మీద అనుమతులు మంజూరు చేశారు. క్షేత్రంలో ప్రధాన కూడలి వద్ద దుకాణానికి స్థలం కేటాయించారు. దుకాణ నిర్మాణ పనులు సైతం చకాచకా జరిగిపోతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగానే గతంలో షాపులను తొలగించిన ప్రదేశంలో ఇప్పుడు మళ్లీ షాపు కేటాయించడంపై దేవస్థాన ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న దుకాణాలను సైతం తొలగించి రోడ్లను విస్తరణ చేశా రు. అలాగే నందిమండపం వద్ద సైతం ఉన్న దుకా ణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రదేశాలలో దుకాణాలు కేటాయించారు. క్షేత్ర అభి వృద్ధి కోసం గతంలో దుకాణాలు తొలగించిన చోట ఇప్పుడు అదే ప్రదేశంలో షాపు కేటాయించడం వెను క పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు మెప్పు కోసం నిబంధనలను సైతం లెక్కచేయకుండా అనుమతలిచ్చినట్లు సమాచారం. దేవస్థానం ఉన్నతాధికారి పాలనలో దేవస్థానం భక్తుల సంతృప్తి స్థాయిలో చివరి స్థానానికి చేరిందని ప్రభుత్వ పెద్దలు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ ముఖ్యనేత చెందిన డెయిరీ కాకుండా ఇంకా చాలా ప్రైవేట్ డెయిరీ లు సైతం శ్రీశైలంలో ఉన్నాయి. వాటికి కూడా ప్రధా న కూడలిలో స్థలాన్ని కేటాయించాలనే విజ్ఞప్తులు సైతం వస్తాయనే అవగాహన లేకుండా అనుమతులు ఇవ్వడంపై అధికారి తీరును పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిని వివరణ కోరగా.. సంఘం డెయిరీకి, వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.
శ్రీగిరిలో టీడీపీ నేత డెయిరీకి
అగ్రతాంబూలం
మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా దుకాణాలు
తొలగించిన ప్రదేశంలో డెయిరీకి స్థలం
కేటాయింపు
చకాచకా జరుగుతున్న నిర్మాణ పనులు
దేవస్థాన ఉన్నతాధికారి తీరును
ప్రశ్నిస్తున్న దుకాణదారులు


