పింఛన్ల దరఖాస్తుకు సర్వర్ మొరాయిస్తుండటంతో రెండో రోజు మంగళవారం కూడా ప్రజలు ఇంటిముఖం పట్టారు. సోమవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో అర్హులు సచివాలయాల వద్దకు చేరుకుంటున్నారు. అయితే సర్వర్ మొరాయించడంతో గంటల తరబడి పనులు మానుకుని అక్కడే వేచి ఉండాల్సి వస్తోంది. ఉదయం ఒకటి రెండు దరఖాస్తులు పూర్తయ్యేసరికి సర్వర్ మొరాయించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రమైనా దరఖాస్తులు పూర్తి కాకపోవడంతో ఇంటి దారి పట్టారు. – గోనెగండ్ల


