ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 15 ఎకరాల సొంత పొలంతో పాటు ఎకరాకు రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని 30 ఎకరాల్లో మినుము సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సాగునీటి తడులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు ఖర్చుచేశాను. పైరు పూత, పిందె దశలో అధిక ఎండలు, చీడపీడల కారణంగా దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఎకరాకు బస్తాకు మించి దిగుబడులు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
– సుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం
ఈ ఏడాది ఖరీఫ్‌లో 16 ఎకరాల్లో మినుము పంట వేశాను. పెట్టుబడుల రూపంలో ఎకరాకు 20 వేలు వెచ్చించాను. వర్షాభావ పరిస్థితులతో పైరు ఎండి పోవడంతో పది ఎకరాల్లో పంటను దున్ని వేశాను. మిగిలిన పైరులో దిగుబడులు వస్తాయనుకుంటే ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఎండిపోయింది. ఈ ఏడాది మినుము సాగుతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. అధికారులు పంట నష్టం చెల్లించి మినుము రైతులను ఆదుకోవాలి. – వెంకట్రామిరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం


