కర్నూలు: రాజీపూర్వకంగా కేసుల పరిష్కారంపై న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి గణనీయ సంఖ్యలో కేసులను రాజీ ద్వారా పరిష్కరించే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మంగళవారం నందికొట్కూరు పరిధిలోని పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి దివ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


