కూరగాయల ధరలు పెరిగాయి. టమాట, పచ్చిమిరప దొరకడం లేదు. ఇవి లేకపోవడంతో పచ్చడన్నమే కరువైంంది. ఏం తినాలో ఏమో? ప్రభుత్వం ధరలు తగ్గించాలి.
–రోజమ్మ, నంద్యాల
గత నెల రోజుల నుంచి బీన్స్ ధర తగ్గడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.100 కూడా పలికింది. ఇప్పుడేమో కాసింత తగ్గి రూ.80 పలుకుతోంది. అలాగే అల్లం ధర కూడా తగ్గలేదు. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
–విషాలేశ్వరరావు, నంద్యాల


