కొనలేం.. తినలేం! | - | Sakshi
Sakshi News home page

కొనలేం.. తినలేం!

Jul 30 2026 5:00 AM | Updated on Jul 30 2026 5:00 AM

కూరగాయల ధరలు

(కిలో.రూ.ల్లో)

పెరిగిన కూరగాయల ధరలు

బెంబేలెత్తుతున్న వినియోగదారులు

నంద్యాల(న్యూటౌన్‌): వర్షాకాలంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గత ఇరవై రోజులుగా సామాన్య, మధ్య తరగతికి చెందినవారు కొని, తినలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా కూరగాయల దిగుబడి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. రైతు బజార్‌లో రూ.500 పెట్టి కూరగాయలు కొన్నా.. చేతి సంచి నిండా రావడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.

పచ్చడి మెతుకులూ కరువే!

పచ్చి మిరపకాయల ధర గత నెల రోజుల నుంచి తగ్గడమే లేదు. తొలుత కిలో రూ.25 నుంచి ప్రారంభమై తరువాత కిలో రూ.40 ఆపై రూ.70కు చేరింది. దీంతో పచ్చడి మెతుకులకూ సామాన్యులు దూరమయ్యారు. అల్లం ధర రూ.140 నుంచి రూ.160కు చేరడంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి. వారపు సంతల్లో కూరగాయలు చౌకగా లభిస్తాయనేది ప్రజల నమ్మకం. అయితే సంతకు రూ.200 నుంచి రూ.250 డబ్బులు తీసుకెళ్తే కూరగాయలు రకానికి ఒకటి చొప్పున కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో పప్పు దినుసుల ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉద్దిపప్పు రూ.145, కిలో వేరుశనగ రూ.150, కిలో కందిపప్పు రూ.140, నూనెలు కంపెనీలను బట్టి రూ.170 నుంచి రూ.200 వరకు ధరలు ఉన్నాయి.

బీన్స్‌ 70

కాకరకాయ 70

చిక్కుడుకాయ 70

కాప్సికమ్‌ 60

బీరకాయులు 80

క్యారెట్‌ 60

మునక్కాయలు 70

మట్టికాయలు 70

కాలీఫ్లవర్‌ 70

ముల్లంగి 60

బంగాళాదుంప 50

దొండకాయ 70

బెండకాయలు 70

బీట్రూట్‌ 40

వంకాయ 80

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement