సంబరంగా స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

సంబరంగా స్నాతకోత్సవం

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

కర్నూలు సిటీ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్చాక్చరింగ్‌(ట్రిపుల్‌ఐటీడీఎం) స్నాతకోత్సవం శనివారం సంబరంగా సాగింది. జగన్నాథగట్టులోని ఆ సంస్థ క్యాంపస్‌లోని కృష్ణ సెమినార్‌ హాల్‌లో మొత్తం 249 మంది విద్యార్థులకు అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డ్యూయల్‌ డిగ్రీ, డాక్టరేట్‌లను అందజేశారు. ట్రిపుల్‌ఐటీడీఎం బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ ఆచార్య ఎన్‌.వి రమణారావు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ప్రముఖ భారతీయ శాసీ్త్రయ సంగీత విద్యాంసుడు, మృదంగ విద్యాంసుడు, పద్మశ్రీ డాక్టర్‌ యోల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. పట్టాలను అందజేసిన తరువాత ప్రసంగించారు. క్రమ శిక్షణ, అంకిత భావం, పట్టుదలతో ఉన్నతస్థాయిని సాధించాలన్నారు. పట్టభద్రులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలన్నారు.

డిసిప్లినరీ మైనర్‌ ప్రోగామ్‌లు..

77 శాతం మందికి ఉద్యోగాలు

ట్రిపుల్‌ఐటీడీఎం 2025–26 విద్యా సంవత్సరంలో సాధించిన విజయాలను డైరెక్టర్‌ ఆచార్య బి.ఎస్‌ మూర్తి వివరించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌, ఆన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి రంగాలలో ఇంటర్‌ డిసిప్లినరీ మైనర్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశ పెట్టడం ద్వారా ట్రిపుల్‌ఐటీడీఎం తన విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుందన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 93 రిక్రూటర్లు 101 క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహించగా మొత్తం 77 శాతం మందికి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు పొందారన్నారు. అత్యధికంగా వార్షిక ప్యాకేజీ రూ.65 లక్షలు, సగటు ప్యాకేజీ రూ.11.68 లక్షలు అందుకోనున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్‌, అమోజాన్‌, ఇన్ఫోసిస్‌, ఐబీఎం, డెలాయిట్‌, టీసీఎస్‌ వంటి కంపెనీలకు తమ సంస్థ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. క్యాంపస్‌లోని హాస్టల్స్‌ విస్తరించి 500 కిలోవాట్ల సోలార్‌ రూప్‌టాప్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మణిపూర్‌ నీట్‌ డైరెక్టర్‌ సోమయాజులు, రిజిస్ట్రార్‌, ఆచార్యలు, తదితరులు పాల్గొన్నారు.

పతకాలు పొందిన వారు

ట్రిబుల్‌ఐటీడీఎం 2022–26 బ్యాచ్‌కి చెందిన 250 మందికి పట్టాలను అందజేశారు. ఇందులో 211 మంది బీటెక్‌, 29 మంది ఎంటెక్‌, ఒకరు డ్యూయల్‌ డిగ్రీ–ఎంటెక్‌, పీహెచ్‌డీ, తొమ్మిది మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.

క్యాంపస్‌ ఓవరాల్‌ గోల్డ్‌మెడల్‌ సీఎస్‌ఈకి చెందిన సోహైబ్‌ అఫ్తాబ్‌ అందుకున్నారు.

బీటెక్‌ సీఎస్‌ఈలో బాలికల్లో అత్యధిక సీజీపీఏ సాధించినందుకు యంగోటి సాయి భవ్య దుర్వాసుల మాణిక్యాంబ ఎండోమెంట్‌ గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.

సీఈసీలో సోహైబ్‌ అఫ్తాబ్‌ (సీఎస్‌ఈలో అత్యధిక సీజీపీఏ సాధించినందుకు), యంగోటి సాయి భవ్య(అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డాటా సైన్స్‌)సిల్వర్‌ మెడల్‌ అందుకున్నారు.

యాశ్‌ కుష్మాహా(ఈసీఈ), సోహమ్‌శర్మ(మెకానికల్‌ ఇంజినీరింగ్‌) సిల్వర్‌ మెడల్‌ అందుకున్నారు.

ట్రిబుల్‌ఐటీడీఎంలో ఘనంగా

‘పట్టా’భిషేకం

249 మంది విద్యార్థులకు

పట్టాలు అందజేత

సాంకేతికత, పరిశోధన విద్యలో

ట్రిపుల్‌ఐటీడీఎం కర్నూలుకు

ప్రత్యేక గుర్తింపు

ఇద్దరికి బంగారు పతకాలు,

ఆరుగురికి సిల్వర్‌ మెడల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement