ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

● న్యాయం చేయాలంటున్న మాజీ జవాన్‌

డోన్‌ రూరల్‌: కొందరు వ్యక్తులు తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మాజీ సైనికుడు చండీశ్వర్‌ గౌడ్‌ వాపోయారు. పట్టణానికి చెందిన చండీశ్వర్‌ గౌడ్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విభాగంలో పని చేశారు. స్థానిక కంబాలపాడు రోడ్డులోని ఉలిగమ్మగుడి వద్ద సర్వే నెంబర్‌ 385–1ఏలో ప్లాట్‌ నెంబర్‌ 94 (రెండు సెంట్లు)ను దాదాపు 30 ఏళ్ల క్రితం తన భార్య పద్మావతి పేరుపై కొనుగోలు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం గత ఏప్రిల్‌ నెల 26వ తేదీ ఈ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే స్థానికుడైన మల్లికార్జున గౌడ్‌, అతని సోదరులు తన గృహ నిర్మాణానికి అనేక అడ్డుంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు మరో ఏడుగురిని కూడా ఈ ప్రాంతంలో గృహాలు నిర్మించుకోకుండా దౌర్జ్యనానికి పాల్పపడుతున్నారని వాపోయారు. వారితో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement