గోనెగండ్ల: ‘రిషీ.. పలకవేమీ’ అంటూ తల్లిదండ్రులు బోయ రాజు, అరుణమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి మగపిల్లవాడు లేకపోవడంతో రాజు భార్య అరుణమ్మ చెల్లెలు నాగమణి కుమారుడు రిషీనిమూడేళ్ల క్రితం దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే విధి వక్రీకరించించి గురువారం ఉదయం బాత్‌రూములో హీటర్‌ను పట్టుకుని రిషీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్న బాలుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


