● పోలీసు స్టేషన్‌లో తెలుగు తమ్ముళ్ల పంచాయితీ
బేతంచెర్ల: అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలతో గోర్లగుట్ట చెరువు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. చెరువు అభివృద్ధి కోసం మైనర్ ఇరిగేషన శాఖ రూ.9.6 లక్షల మంజూరు చేయగా పను లు ప్రారంభించిన రోజున వివాదం చెలరేగింది. చెరువులో కంప చెట్ల తొలగింపు, కట్ట బలోపేతం వంటి పనులకు ఆర్డర్ తెచ్చుకున్నామని ఓ టీడీపీ వర్గం బుధవారం పనులు ప్రారంభించింది. అయి తే అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు కూడా.. తన వద్ద పనుల అనుమతి ఉందంటూ పనులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోంది. మేమే పనులు చేస్తాం.. అంటూ రెండు వర్గాలు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివాదం మరింత ముదరడంతో ఒక వర్గం వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చర్చలు నిర్వహించినట్లు సమాచారం. చెరువు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాల్సిన సమయంలో రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా పనులు నిలిచిపోవడంపై గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.


