గత ప్రభుత్వం పాఠశాలల్లో రెండవ విడత నాడు – నేడు కింద అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, ప్రహరీలు, వంటగదుల నిర్మాణ పనులను తలపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిచిపోయాయి. పాఠశాలలు ప్రారంభమవుతున్నా జిల్లాలో పలుచోట్ల వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్లు మరమ్మతులకు నోచు కోవడం లేదు. నాడు – నేడు నిధులతో స్కూళ్ల ప్రారంభ సమయానికి ముస్తాబు కావాల్సిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల్లో నాడు – నేడు పనుల్లో చివరి దశకు చేరుకున్న వాటిని పూర్తి చేయాలని భావించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 9.8 కోట్లతో మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, వాటర్ ప్లాంట్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులు ఆదేశించినా పనులు నేటికీ కూడా పనులు పూర్తి కాలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పైసా కూడా విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.


