బొమ్మలసత్రం: పోలీస్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. గురువారం నంద్యాల సబ్‌డివిజన్ పరిధిలో పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పట్టణంలోని టూటౌన్, తాలూకా పోలీస్టేషన్లతో పాటు గోస్పాడు పోలీసుస్టేషన్ ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వాహణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. పట్టణంలో కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించి అత్యవసర సమయాల్లో స్పందించే వేగాన్ని మెరుగుపరచాలాని సూచించారు. సీసీ కెమెరాల పనితీరుపై శ్రద్ధ వహించాలన్నారు.


