కోవెలకుంట్ల: పనులకు వెళ్లే కూలీలు ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో సాగు చేసిన శనగ నూర్పిడి పనులు యంత్రాల సాయంతో చేస్తున్నారు. కోతకోసిన పప్పుశనగ అడలను కంబైన్డ్ హార్వెస్టర్‌లో వేసి నూర్పిడి చేయాల్సి ఉంది. గ్రామాలకు దూరంలో ఉండే పొలాలకు కూలీలు యంత్రంలోని గ్రిల్‌లో కూర్చొని వెళుతున్నారు. పొరపాటున యంత్రం వెళ్లే సమయంలో గ్రిల్ ఆన్‌అయితే కూలీలు చట్రంలో పడి ప్రాణాలు కోల్పోవాల్సిందే. గతంలో గ్రిల్‌లో కూర్చుని ప్రమాదశాత్తు అందులో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా కూలీలను గ్రిల్‌లో తరలించకుండా పొలాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
సత్వర చికిత్స కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గోస్పాడు: జిల్లా సత్వర చికిత్స కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వినికిడి దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో చిన్న పిల్లలకు వినికిడిని పరీక్షించుకోవాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి కాంతారావునాయక్, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు హిమ గణేష్
నంద్యాల(న్యూటౌన్): బనగానపల్లెలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దివ్యాంగ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హిమ గణేష్ జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు హైదరాబాదులో ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్నారు. విజయనగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో హిమ గణేష్ ప్రతిభ కనబరిచారని జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో హిమ గణేష్‌ను బుధవారం అభినందించారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే గురువారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఆమె బుధవారం మాట్లాడుతూ.. కళాశాలలో ఇది 63వ గ్రాడ్యుయేషన్ సెర్మనీ అని పేర్కొన్నారు. అరోకా 26 పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాడాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.


