ఆత్మకూరు: ప్రభుత్వ వైద్యాధికారిణిగా ఉద్యోగం రావడంతో ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఆసియా మారూఫ్‌కు బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఓబులేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మునిపల్ చైర్‌పర్సన్‌గా తనకు వైఎస్సార్‌సీపీ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని రకాల నిధులతో ఆత్మకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రషీద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో 256 మంది గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ పేపర్–2ఏ, సివిక్స్ పేపర్–2, వొకేషనల్–2 పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. మొత్తం 10,376 మంది విద్యార్థులకు గాను 1,120 మంది హాజరు కాగా 256 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.


