చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం | - | Sakshi
Sakshi News home page

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

చీకటి

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పనులతో నిలిచిన నీరు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని చెప్పే చిత్రం ఇదీ..

జూపాడుబంగ్లా: రాయలసీమ ప్రజలు తమ గర్జనను వినిపించే సమయం ఆసన్నమైంది. సాగునీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ‘తాకట్టు’పై శంఖారావం పూరించే మహోన్నత అవకాశం లభించింది. గురువారం పోతులపాడు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ‘సీమ’ అకాంక్ష ప్రదర్శితం కానుంది. అనుమతివ్వకపోయినా కచ్చితంగా ‘చలో పోతిరెడ్డిపాడు’ నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌బాష, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమతులు మంజూరయ్యాయి. వెంటనే పోతులపాడు గ్రామంలోని వెంకటశివారెడ్డి, చిన్నశాంతన్న పొలంలో రైతుశంఖారావం సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు ప్రారంభించారు.

అడ్డంకులను దాటుకుని..

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవటానికి కారణమైన సీఎం చంద్రబాబు మోసాన్ని రైతులు, ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 5న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు. అందులో భాగంగా జనవరి 30న పోతులపాడు గ్రామంలో సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ ఆదేశాలతో 30వ తేదీ సాయంత్రం ఆత్మకూరు డీఎస్పీ రాంమాజనేయనాయక్‌, నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రమణ్యం స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించారు. దీంతో అక్కడ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 6 కిలోమీటర్ల పరిధిలో సభ నిర్వహించవద్దని సూచించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన తరిగోపుల క్రాస్‌రోడ్డు వద్ద రైస్‌మిల్‌ సమీపంలో సభ నిర్వహణకు మరోసారి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, దారా సుధీర్‌, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అయినా సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుధవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు. వెంటనే పోతులపాడులో సభ నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే సభకు రాయలసీమ జిల్లాల్లోని రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలునిచ్చారు.

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన మోటార్లు బిగించని ప్రాంతం

నందికొట్కూరు: తల్లిలాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టడంపై రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. రాయలసీమ జిల్లాలోని 52 నియోజకవర్గాలకు, నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు కష్టాలు తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ పథకంతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు కాల్వలోకి ఎత్తిపోయవచ్చు. రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు కష్టాలు తీరుతాయి. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు సీఎం చంద్రబాబు ఆపేశారని రైతులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు.

ఆంక్షలు విధిస్తూ భారీ బందోబస్తు

చలో పోతిరెడ్డిపాడు సభ నిర్వహణకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంతో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ అధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 80 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు. సభకు వచ్చే వారు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్దనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సభకు ఎలా వచ్చారో ముగిసిన తర్వాత అలాగే వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చూసేందుకు వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతు శంఖారావం పేరుతో

‘చలో పోతిరెడ్డిపాడు’

పోతులపాడులో ముమ్మరంగా

సభ ఏర్పాట్లు

దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న

కాటసాని, సిద్ధార్థరెడ్డి, దారాసుధీర్‌

రాయలసీమ రైతులు, ప్రజలు భారీగా

తరలిరావాలని పిలుపు

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం1
1/6

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం2
2/6

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం3
3/6

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం4
4/6

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం5
5/6

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం6
6/6

చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement