పార్వేట ఉత్సవం.. ‘సర్వా’ శోభితం | - | Sakshi
Sakshi News home page

పార్వేట ఉత్సవం.. ‘సర్వా’ శోభితం

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

పార్వ

పార్వేట ఉత్సవం.. ‘సర్వా’ శోభితం

ఉయ్యాలవాడ: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పార్వేట ఉత్సవ పల్లకీ బుధవారం ఉయ్యాలవాడ మండలంలోని సర్వాయిపల్లె గ్రామానికి బుధవారం ఉదయం 6 గంటలకు చేరుకుంది. గ్రామస్తులు, అధికారులు ఎదురేగి స్వాగతం పలికారు. ఉత్సవం సర్వాయిపల్లెకే పరిమితం కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్రామానికి చెందిన సన్నితి సుబ్రమణ్యం శ్రేష్టి స్వగృహం నుంచి నూతన వస్త్రాలు మేళ తాళాలతో తెలుపు వద్దకు చేరుకుని మొదటి పూజ చేశారు. స్వామి వారి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనవాయితీ ప్రకారం ప్రహ్లాదవరద స్వామి, జ్వాలా నరసింహ స్వామికి ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో కోనేటి పుణ్య స్నానాలు చేయించారు. స్వామి వార్లకు క్షీర, పంచామృతాభిషేకం చేశారు. సంక్రాంతి పర్వ దినాన అహోబిలం కొండ దిగి బాచాపురంలో మొదటి పూజ అందుకున్నారు. ఇరవై రోజుల తరువాత ప్రహ్లాద వరద స్వామి, జ్వాలా నరసింహస్వామికి ఏకాంత అభిషేకాలు చేపడతారు. ఏటా ఈ కార్యక్రమాన్ని సర్వాయిపల్లె గ్రామంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు పేర్కొన్నారు.

పార్వేట ఉత్సవం.. ‘సర్వా’ శోభితం1
1/1

పార్వేట ఉత్సవం.. ‘సర్వా’ శోభితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement