
మల్లన్న హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ ఆలయాల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణ రూ.4,51,62,522 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం చంద్రవతి కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. బంగారం 164.500 గ్రాములు, వెండి 5.840 కిలోలు లభించాయి. అలాగే యూఎస్‌ఏ డాలర్లు 598, న్యూజిలాండ్ డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 100, ఇంగ్లాండ్ పౌండ్స్ 10, ఈరోస్ 100, ఓమన్ బైసా 300, కెనడా డాలర్లు 20, కువైట్ దినార్ 1, సౌదీ అరేబియా రియాల్ 115, కత్తార్ రియాల్స్ 102 మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించినట్లు ఈఓ పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.