
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలు
దొర్నిపాడు: తొలిపంటగా సాగుచేసిన నల్లబంగారం చేతికిరాని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పూర్తిగా దెబ్బతినింది. కేవలం 90 రోజుల్లో చేతికి వస్తుందని రైతులు విస్తారంగా మినుము పంట వేశారు. ఒక్క దొర్నిపాడు మండలంలోనే దాదాపు 700 హెక్టార్లకు పైగా ఈ పంట సాగైంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా కోత సమయంలో రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. గత పది రోజులుగా కురుస్తున్న వానలకు మినుము పంటంతా నీటిలోనే ఉంది. దీంతో కోత పనులు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోతమిషన్లు పనులు లేక గ్రామంలో నిలబడిపోయాయి. రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో కోతకు నేల అనుకూలించక రైతులు దిగాలు చెందుతున్నారు. కాసిన అరకొర గింజలు సైత నేల రాలుతున్నాయని వాపోతున్నారు.

ఇంకా నీటిలోనే నల్ల బంగారం

ఇంకా నీటిలోనే నల్ల బంగారం