
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్‌కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో 8 బెటాలియన్లకు సంబంధించిన సిబ్బంది పరేడ్‌లో పాల్గొనగా కర్నూలు రెండవ బెటాలియన్‌కు సంబంధించి ఆర్‌ఐ అనిల్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు సర్దార్, మునాఫ్‌ల ఆధ్వర్యంలో చక్కటి కవాతు ప్రదర్శన(పెరేడ్) నిర్వహించారు. దీంతో రాష్ట్రస్థాయిలో కంటింజెంట్ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో బెటాలియన్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్‌లో చక్కటి నైపుణ్యత ప్రదర్శించి కంటింజెంట్ అవార్డును అందుకున్నందుకు పటాలం సిబ్బందిని కమాండెంట్ దీపిక పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
రుద్రవరం రేంజర్‌గా ముర్తుజావలి
రుద్రవరం: రుద్రవరం రేంజ్ అధికారిగా ముర్తుజావలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన 2023లో రుద్రవరం రేంజ్ అహోబిలం సెక్షన్ డీఆర్వోగా విధుల్లో చేరాడు. ఇటీవలె రేంజి అధికారిగా ఉన్న శ్రీపతినాయుడు బదిలీపై వెళ్లడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఆర్వోగా ఉన్న ముర్తుజా వలికి రేంజర్‌గా పదోన్నతి కల్పించి రుద్రవరానికి నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.