
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు గ్రామం పెండేకంటినగర్‌లో నివాసముంటున్న సుబ్బరాయుడు కొడు కు భానుప్రకాష్‌కు, అదే గ్రామానికి చెందిన రెడ్డిపోగు మాదన్న కూతురు భారతి(31)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప,బాబు సంతానం. అయితే ఆటో నడిపే భాను ప్రకాష్ మద్యానికి అలవాటుపడి సంపాదనంతా మందుకే ఖర్చు చేసేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో భార్య భారతి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి మాద న్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్ పేర్కొన్నారు.
అప్పులబాధతో..
బనగానపల్లె మండలం నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని కై ప గ్రామానికి చెందిన రైతు వెంకటరమణరెడ్డి(37) అనే వ్యక్తి అప్పుల బాధతో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతేడాది రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయితే, పంట పండక తీవ్రనష్టం వచ్చింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె సంతానం.
జీవితంపై విరక్తి చెంది..
మిడుతూరు మండలం అలగనూర్ గ్రామానికి చెందిన షేక్ జుబేదాబేగం (20) అనే యువతి గురువారం రాత్రి బలవన్మరణం చేసుకుంది. అనారోగ్యంతో పాటు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ మేరకు తండ్రి ఉసేన్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సుబ్బయ్య తెలిపారు.

వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం