ఉచితం.. అగమ్యగోచరం | - | Sakshi
Sakshi News home page

ఉచితం.. అగమ్యగోచరం

Aug 17 2025 6:27 AM | Updated on Aug 17 2025 6:27 AM

ఉచితం.. అగమ్యగోచరం

ఉచితం.. అగమ్యగోచరం

చర్యలు తీసుకుంటాం

మహిళలకు తప్పని తిప్పలు

మూలపడిన పల్లెవెలుగు బస్సులు

శ్రీశైల క్షేత్రానికి

కొత్త బస్సు సర్వీసులు నిల్‌

ఆత్మకూరు: మహిళలకు ఉచిత బస్సు అని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. బస్టాండ్‌కు వెళ్లిన వారు ఉచిత బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. బస్సు వస్తుందో.. రాదో తెలియని దుస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాక మూలనపడిన వాటికి మరమ్మతులు సైతం చేయలేదు. దీంతో ఉచిత బస్సు కోసం చూసే మహిళలకు నిరాశే ఎదురవుతోంది.గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేనప్పుడు ఉచిత ప్రయాణం ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి రావాలంటే, పట్టణం నుంచి పల్లెలకు వెళ్లాలంటే ప్రైవేట్‌ వాహనాలే దిక్కవుతున్నాయని చెబుతున్నారు.

మరమ్మతులు చేసినా?

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌ డిపోల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అధికారులు విద్యార్థి బస్సులను వాడుతున్నారు. మరమ్మతులకు గురైన పల్లె వెలుగు బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బస్సులే అదనపు సర్వీసులకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి డిపోలో దాదాపు 10 నుంచి 14 బస్సులకు మరమ్మతులు చేసి వాటిని అదనపు సర్వీసుల కింద నడపనున్నారు. కాగా ఈ బస్సులకు మరమ్మతులు చేసినా ఎంత దూరం ప్రయాణిస్తాయి, అసలు ఇవి కండిషన్‌లో ఉంటాయా? మహిళలను, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయా లేదో వేచి చూడాలి.

పాత బస్సులే దిక్కు

నంద్యాల, కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లా, వైఎస్సార్‌ జిల్లా నుంచి శ్రీశైలానికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లడం పరిపాటి. మహిళలకు ఉచిత బస్సు పేరుతో పాతవాటినే నడుపుతున్నారు. మహిళలు అధికంగా ఉంటే ఆత్మకూరు నుంచి దోర్నాల మీదుగా 110 కి.మీ. దూరం ఆ బస్సు శ్రీశైలం వెళ్తుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంత దూరం మహిళలు బస్సులో నిలబడి ఎలా ప్రయాణిస్తారు? మహిళలకు కావాల్సిన సీట్లు ఖాళీగా ఉంటాయా? రిజర్వేషన్‌ సౌకర్యం, ఇతర భక్తులు ఉచితంగా దర్శనానికి వెళ్లే మహిళల పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మహిళలు శ్రీశైల క్షేత్రానికి పోటెత్తే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించి శ్రీశైలం మహాక్షేత్రానికి అదనపు బస్సు సర్వీసులను వేయాల్సి ఉంది.

మహిళల కోసం అదనపు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థి బస్సు సర్వీసులతో పాటు షెడ్‌లో రిపేరీ ఉన్న బస్సులకు కూడా మరమ్మతులు చేస్తున్నాం. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లేందుకు బస్సులకు మరమ్మతులు చేయించి ఘాట్‌ ఎక్కేలా చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం క్షేత్రానికి మంచి ఇంజన్‌ కలిగిన బస్సులను నడుపుతాం. పల్లె వెలుగు సర్వీసులైనా మంచి బస్సులను ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

– రజియాసుల్తానా,

ఆర్టీసీ ఆర్‌ఎం, నంద్యాల

పల్లె వెలుగు సర్వీసులన్నీ

తొలగింపు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె వెలుగు బస్సు సర్వీసులు చాలా వరకు తొలగించారు. గతంలో పల్లెలకు ఎన్నో బస్సు సౌకర్యాలు ఉండేవి. కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం, ఎర్రమఠం, పెద్దగుమ్మడాపురం, గువ్వలకుంట్ల గ్రామాలకు తిరిగేవి. అలాగే పాములపాడు మండలంలోని మద్దూరు, వాడాల, వేంపెంట గ్రామాలకు బస్సు వెళ్లేది. కురుకుంద, కొట్టాల చెరువు, వెలుగోడు మండలంలోని రేగడగూడూరు, గుంతకందాలకు ప్రతిరోజూ రెండు బస్సులు తిరిగేవి. ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి ప్రతి రోజూ పల్లెలకు 15 బస్సులు సర్వీసులు ఉండేవి. ప్రస్తుతం ఈ బస్సు సర్వీసులన్నీ తొలగించారు. దీంతో గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బడిపిల్లలకు మాత్రం ఉదయం, సాయంత్రం కేవలం రెండుసార్లు మాత్రమే కొన్ని గ్రామాలకు ఒకే బస్సును కేటాయించారు. దీంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతూనే విద్యార్థి బస్సు సర్వీసు పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement