
యువకుడి అనుమానాస్పద మృతి
నంద్యాల: ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాణ్యం మండలం కౌలూరు గ్రామ సమీపంలోని రైలు పట్టాల మధ్య మృతదేహం లభించింది. రైల్వే పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గడివేముల మండలం కొర్రపోలూరుకు చెందిన రామసుబ్బయ్య కుమారుడు సూర్య (23) డిగ్రీ చదివి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కెళ్లాడు. ఇటీవలే అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు పని ఉందంటూ రెండు రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ కౌలూరు సమీపంలో రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతుడు ఓ యువతిని ప్రేమించాడని..అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. ఈ క్రమంలో యువకుడి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి అక్కడ పారవేశా రా లేక ప్రేమ విఫలమై యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమ కుమారుడిది హత్యేననివిచారించి న్యాయం చేయాలని సూర్యతల్లిదండ్రులు కోరుతున్నారు.