జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు: 43 0–6 నెలల శిశువులు: 16,785 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులు: 66,824 3–6 సంవత్సరాల్లోపు చిన్నారులు: 42,104 గర్భిణులు: 17,246బాలింతలు: 18,112 | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు: 43 0–6 నెలల శిశువులు: 16,785 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులు: 66,824 3–6 సంవత్సరాల్లోపు చిన్నారులు: 42,104 గర్భిణులు: 17,246బాలింతలు: 18,112

Aug 14 2025 7:59 AM | Updated on Aug 14 2025 7:59 AM

జిల్ల

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ

నత్తనడకన నెట్‌వర్క్‌

పనిచేయని యాప్‌లు

పెరిగిన పని ఒత్తిడి

సెల్‌ఫోన్లు వెనక్కి ఇచ్చిన

అంగన్‌వాడీ కార్యకర్తలు

ఆళ్లగడ్డ: పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు తదితర వాటిని అప్‌లోడ్‌ చేసేందుకు ఇచ్చిన వివిధ రకాల యాప్‌లతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన పక్కదారి పడుతోంది. ‘పనిచేయలేమని ఫోన్లు మాకొద్దు’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఫోన్లు, సిమ్‌లు వెనక్కి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ్‌ ట్రాకర్‌, రాష్ట్ర యాప్‌ బాల సంజీవని, కిశోర వికాస్‌, మిషన్‌ వాత్సల్య, సఖి వంటి యాప్‌ల్లో నిత్యం డేటా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పీఎంఎంవీవై యాప్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా కేంద్రాలకు పాలు సరఫరా చేసెందుకు ఏర్పాటు చేసిన మిల్క్‌ యాప్‌తో పాటు ప్రతి మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కోసం ఉన్న యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఇంతవరకు ఏఎన్‌ఎంలు చేసే మాతృవందన పథకానికి సంబంధించిన యాప్‌ త్వరలో అంగన్‌వాడీలకు అప్పగించనున్నారు.

నెలకు 5 జీబీ డేటా!

ఇప్పటికే రాష్ట్ర ప్రభత్వం ఇచ్చిన బాల సంజీవని యాప్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పోషణ ట్రాకర్‌ యాప్‌ లో కూడా నిత్యం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఇందు కోసం ఆన్‌లైన్‌ వర్క్‌ చేసేందుకు ప్రభుత్వం నెలకు 5 జీబీ డేటాను మాత్రమే ఇస్తోంది. అది అయిపోతే సొంతంగా రీచార్జ్‌ చేసుకుందామన్నా వీలుండదు. ఆన్‌లైన్‌ వర్క్‌ ఎప్పటికప్పుడు ఎందుకు చేయలేదని ఉన్నతాధికారులు వేధింపులు.. సూటిపోటి మాటలతో మానసికంగా కుంగిపోతున్నారు. బాలింతలకు పోషకాహారం ఇచ్చేందుకు ఆధార్‌ను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అనేక మంది బాలింతల ఫొటో ఆధార్‌ కార్డులో 12 నుంచి 15 సంవత్సరాల వయసులోది మాత్రమే ఉంటుంది. ఆ ఫొటోలోని ముఖ కవలికలను గుర్తు పట్టేందుకు యాప్‌ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక్కో సారి ఫోన్‌లో డాటా చాలక ఆ ప్రక్రియ మధ్యలోనే నిలచిపోతోంది.

‘రికార్డు’ స్థాయిలో అవస్థలు

ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు 15 రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం, పిల్లలు, బాలింతలు, గర్భిణులు నమోదు, ఫ్రీ స్కూల్‌ అడ్మిన్‌ రికార్డులను ప్రతిరోజు విధిగా నమోదు చేయాలి. మరో వైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్‌ – ఏ రికార్డులు, రిఫరల్‌ సర్వీసెస్‌, గృహ సందర్శన రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్‌హోల్డ్‌ సర్వే రికార్డు, గ్రోత్‌ చార్ట్‌ తదితర రికార్డులు నమోదు చేయడంతో సమయం అంతా గడిచి పోతోంది.

ఆటంకాలు ఇవీ..

● గతంలో అంగన్‌వాడీ కేంద్రాల దగ్గరే పోషకాహారం ఇచ్చేవారు. దీనిని టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌)గా మార్చారు. పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు సార్లు ఇంటి దగ్గరే అందిస్తున్నారు. రెండు సార్లు పోషక్‌ ట్రాకర్‌ యాప్‌లో వివరాల నమోదుకే ఎక్కువ సమయం పడుతోంది.

● బాల సంజీవనిలోని ఆరు రకాల వస్తువులు కలిపి ఒక కిట్‌గా లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. అవి ఇచ్చే సమయంలో ఫొటో పోషణ ట్రాకర్‌లో అన్‌లోడ్‌ అవుతుంది. అయితే జిల్లాలోని కాంట్రాక్టర్లు అంతా టీడీపీ నేతలే కావడంతో వారు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదు.

ఇవీ కష్టాలు..

కొత్త యాప్‌లను అప్‌లోడ్‌ చేసేందుకు 2జి ఫోన్లు పనిచేయడం లేదు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి.

గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయసున్న తల్లులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇళ్ల వద్దకే పోషకాహారాన్ని అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఫేషియల్‌ రికగ్నేషన్‌ (ముఖ ఆధారిత గుర్తింపు) ప్రవేశ పెట్టింది. సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో ఇబ్బందిగా మారింది.

బాల సంజీవని, పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లలో నమోదు తర్వాతే సరుకులు అందించాలి. అయితే సెల్‌ఫోన్లు ఐదేళ్ల క్రితం 2జీ నెట్‌వర్క్‌ తో ఇచ్చినవి కావడంతో ఆయా యాప్‌లు తరుచూ మొరాయిస్తున్నాయి.

పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి. నెట్‌వర్క్‌ సరిగా లేకపోయినా, లబ్ధిదారుల మొబైల్స్‌లకు మెసేజ్‌ బ్యాలెన్స్‌ లేక ఓటీపీ రాకపోయినా సరుకులు అందడం లేదు.

కొత్త 5జీ ఫోన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్‌ చేస్తున్నప్పటికీ స్పందన లేదు.

ఒత్తిడికి గురవుతున్నాం

2 జీబీ ర్యామ్‌తో ఉన్న 2జీ నెట్‌వర్క్‌ సిమ్‌తో ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన సెల్‌ఫోన్లతో ఇప్పుడు ఇచ్చిన కొత్త యాప్‌లతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. యాప్‌ల భారమైనా తగ్గించండి. లేదంటే 5జీ సెల్‌ఫోన్లు కాని, ట్యాబ్‌లు కానీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

– ఉదయలక్ష్మీ, అంగన్‌వాడీ కార్యకర్తల

సంఘం మండల అధ్యక్షురాలు, దొర్నిపాడు

యాప్‌లు మొరాయిస్తున్నాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్‌లు తరుచూ మొరాయిస్తున్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో తంటాలు పడుతున్నాం. ఉన్న యాప్‌లతోనే ఇబ్బందులు పడుతుంటే మల్లీ ఏఎన్‌ఎంలు చేసే పీఎంఎంవీవై పని కూడా అప్పగించడం దారుణం. రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు పాత ఫోన్లను సీడీపీఓ కార్యాలయంలో అప్పగించాం. – వసుంధర, అంగన్‌వాడీ వర్కర్స్‌,

హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ 1
1/4

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ 2
2/4

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ 3
3/4

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ 4
4/4

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్‌వాడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement