
విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
గోస్పాడు: విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, సర్వజన ప్రభుత్వాసుపత్రి డాక్టర్ మల్లేశ్వరి అన్నారు. బుధవారం యాంటీ ర్యాగింగ్ డే సందర్భంగా మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిస్థాయిలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వైస్‌ప్రిన్సిపాల్, డాక్టర్లు రాజశేఖర్, కళావతి, హెచ్‌ఓడీలు లోకేశ్వరరెడ్డి, పద్మజ, డాక్టర్ నిరంజన్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని ఎనిమిది చెరువులకు సరఫరా చేస్తున్నట్లు ఏఈ మురళీకృష్ణ, ప్రాజెక్టు చైర్మన్ పూజా మల్లికార్జునరెడ్డి తెలిపారు. వడ్లరామాపురం, కురుకుంద గ్రామాల్లో వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున పాఠశాల విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎవరూ వాగులు వెంట వెళ్లొద్దని సూచించారు.
దరఖాస్తు గడువు
20 వరకు పొడిగింపు
నంద్యాల(న్యూటౌన్): ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలో పేద పిల్లలకు అందించాల్సిన 25శాతం మిగిలిన సీట్ల కోసం ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, సమగ్ర శిక్ష అనదపు అధికారి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు సచివాలయంలో, www.csc.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేస్తామన్నారు. పాఠశాలలో ప్రవేశాలు ఆగస్టు 31 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ 18004258599 నంబరును సంప్రదించాలన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ
ఏర్పాట్ల పరిశీలన
నంద్యాల: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను బుధవారం అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. అధికారులకు, వీఐపీలకు గ్యాలరీల ఏర్పాటు చేయాలని, వేడకులకు హాజరయ్యే అందరికీ మంచినీటి వసతి కల్పించాలన్నారు.
ఎరువుల కృత్రిమ కొరత
సృష్టిస్తే లైసెన్స్‌లు రద్దు
నంద్యాల(అర్బన్): ఎరువుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పట్టణంలోని అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్, సుదర్శన్ ట్రేడర్స్‌లలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టార్లు, బిల్ బుక్స్, నిల్వలు, ఈ పాస్ మిషన్‌లో స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. హోల్‌సేల్, రిటైల్ డీలర్లు నిర్ణయించిన ధరలతోనే రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించాలన్నారు. డీఏఓ వెంట ఏడీఏ ఆంజనేయ, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు ఉన్నారు.

విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి

విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి

విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి