కొత్తపల్లి మండలం బండినాయునిపాలెంలో నీట మునిగిన వరిపైరు
నంద్యాల(అర్బన్): జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 163.8మి.మీ వర్షం కురిసింది. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 20.4మి.మీ వర్షం కురియగా డోన్ మండలంలో అత్యల్పంగా 0.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా మిడుతూరు మండలంలో 16.4, రుద్రవరంలో 15.2, ఆత్మకూరులో 12.8, పగిడ్యాలలో 12.4, పాములపాడులో 11.4, జూపాడుబంగ్లా, నంద్యాల అర్బన్‌లో 10.2 మి.మీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో రైతులు సాగు చేసిన వరిపైరు నీట మునగింది. కురుస్తున్న వర్షాలతో పూత దశలో ఉన్న మినుము నేలకొరిగి పూత, పిందె రాలిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుందూ నది ఉప్పొంగి ప్రవహిస్తోందని, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఎడతెరపి లేకుండా వర్షాలు