
మట్టి విగ్రహాలు ఎంతో మేలు
నంద్యాల: జిల్లాలోని ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తమ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 27వ తేదీ జరిగే వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. రసాయనాలతో చేసిన విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంతో పర్యావరణానికి పెను నష్టం వాటితోందన్నారు. ప్రజలు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలన్నారు.
25న వినాయక విగ్రహాల పంపిణీ...
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈనెల 25వ తేదీ నంద్యాల కలెక్టరేట్‌లో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్‌రెడ్డి, ఏఈఈ రామకృష్ణ, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి